ఆరు గ్యారెంటీల అమలుకై పోరాటం చేస్తాం..

We will fight for the implementation of six guarantees.– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్
నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి గ్రామంలో  కామారెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ముఖ్య కార్యకర్తల సమావేశంనికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంప శశాంక్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన 6  గ్యారెంటీల అమలుకై  బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ గంప గోవర్ధన్  నాయకత్వంలో పోరాటం చేస్తామని, కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హెచ్చరించరు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం కోసం బిఆర్ఎస్ యువజన విభాగం అధికారులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.  కామారెడ్డి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగంని బలోపేతం కోసం కావాల్సిన చర్యల్ని ముమ్మరం చేసి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ నేత, బి ఆర్ ఎస్ యువజన విభాగం కామారెడ్డి, మాచారెడ్డి మండల అధ్యక్షులు అనిల్ రెడ్డి, లష్కర్ నాయక్ బి ఆర్ ఎస్ యువజన విభాగం మండల నాయకులు ప్రభాకర్ రెడ్డి,పరశురామ్ గౌడ్,ప్రభాకర్ గౌడ్, సమీర్,  100 మంది యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.