నవతెలంగాణ – ముధోల్
తమ ప్రాంతం విధ్య అభివృద్ధికి కోసం, అనేక ఆకాంక్షలతో నెలకొల్పబడిన బాసర ట్రిపుల్ ఐటీనీ కొంత మంది అధికారులు, యూనివర్సిటీల ఇంచార్జి వీసీల పేరు మీద వచ్చి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుని యునివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేస్తున్నారని ముధోల్ ప్రాంతానికి చెందిన ఓయు జేఏసీ అద్యక్షులు సర్ధార్ వినోద్ కుమార్ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. బాసర ట్రిపుల్ ఐటీలో యునివర్సిటీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, కన్వోకేషన్ లాంటి కార్యక్రమాలు బాసరలో పెట్టకుండా హైదరాబాద్ లో ఏర్పాటు చేయటం సరికాదన్నారు. ఇంచార్జి వీసీ వేంకట రమణ తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రభుత్వంలో ఉన్న కొంత మంది అధికారుల దగ్గర మార్కులు కొట్టే కార్యక్రమం పెట్టుకున్నట్టు, తన ప్రయివేటు కార్యక్రమం లాగా హైదరబాద్ లో ఏర్పాటు చేసి లక్షల రూపాయల బిల్లులు చేసిన చరిత్ర వీసీకే చెల్లిందని ఆయన ఆ ప్రకటనలో ఆరోపించారు. ఏనాడు బాసర ట్రిపుల్ ఐటీని పట్టించుకోకుండా, వాళ్ళ అవసరాల కోసం యూనివర్సిటీని వాడుకుని, యునివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర చేసే ఎంతటి వారైనా చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. బాసర ట్రిపుల్ ఐటీ పరిరక్షణ కోసం రాజీ లేని పోరాటం చేస్తాం అని ప్రకటించారు. ఇంచార్జి వీసీ వేంకట రమణ చేసిన అన్ని అక్రమాలను బయట పెడతామని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆద్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమార్కుల మీద కఠిన చర్యలు ఉంటాయని సమాచారం తమకు ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్దులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని పేర్కొన్నారు.