– టీయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు..
నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉపాధ్యాయులను ప్రభూత్వం వెంటనే రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న మని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్తాహరి అన్నారు.బుదవారం నిరసన కార్యక్రమం లో బాగంగా అయన మాట్లాడుతూ కాంట్రాక్టు ఉపాధ్యాయులందరిని రెగ్యులర్ చేయాలనే ప్రధాన డిమాండ్ ఉందన్నారు. ఈ విషయంలో గతంలో జాక్ అధ్యక్షులు కర్ణాకర్ రావు ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవడం జరిగిందన్నారు.అనాడు సీఎం ఈ రెగ్యులరైజ్ కోసం అన్ని వివరాలను పంపలని హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక నోట్ డ్రాప్ చేయమని గతంలో పేర్కొన్నాట్లు వివరించారు. అంతకుముందు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఉన్నప్పుడు ఈ విషయంలో వివరణ అడిగారని, అ వివరణను హయ్యర్ ఎడ్యుకేషన్ నుండి పూర్తి వివరాలు రాలేదన్నారు. భవిష్యత్తులో ఇలా డిలే కాకుండా సాధ్యమైన తొందరలో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయటానికి ప్రయత్నం చేస్తుందని హైయరి ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ పాపి రెడ్డి వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు చేసినప్పుడు యూనివర్సిటీ ఉపాధ్యాయుని తప్పనిసరిగా రెగ్యులర్ చేయాల్సి ఉండగా అలా చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు ఉపాధ్యాయులు డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ జలంధర్ ,డాక్టర్ మోహన్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ జి శ్రీనివాస్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ రాజేశ్వర్, సందీప్, డాక్టర్ నేత, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గంగాధర్, వి శ్రీనివాస్, డాక్టర్ నరసింహులు, డాక్టర్ గోపి రాజ్, అపర్ణ, రమ్య, డాక్టర్ స్వామి రావు, గంగా కిషన్, సురేష్, డాక్టర్ డానియల్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.