నిర్వహణ కు ఇస్తాం..

We will give it to management..

– ప్రాజెక్ట్ కు ఎవరు ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తున్నాం – ఆంధ్రా మంత్రులు

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రాజెక్ట్ క్రింద సాగు విస్తీర్ణం ఆంధ్రాలో నే అధికంగా ఉంది,ఆ ప్రాజెక్ట్ గండి తో అత్యధికంగా నష్టపోయిన గ్రామాలు మావే అని అవి పరిశీలించడానికి వచ్చామని,నిర్వహణ కోసం కొంత వ్యయం భరించడానికి సిద్ధమే కానీ ప్రాజెక్ట్ తెలంగాణ లో ఉన్నందు తెగిపోయిన కట్ట మరమ్మత్తులు ఎవరు భరించాలని అలోచన చేస్తున్నాం అని ఆంధ్రా మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్ట్ వరద ముంపు ఆంద్రా గ్రామాలను పరిశీలించి,నిర్వాసితులను పరామర్శించడానికి శనివారం  విపత్తు నిర్వహణ శాఖ, ఉప ముఖ్యమంత్రి వంగలపుడి అనిత, జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లు ఏలూరు జిల్లా వెలేరుపాడు, కుక్కునూరు మండలాల పర్యటనకు వెళ్తూ అశ్వారావుపేట లోని కెమీలాయిడ్స్ అతిథిగృహంలో కొద్ది సమయం సేదతీరిన అనంతరం అల్పాహారం స్వీకరించిన సందర్భంగా అశ్వారావుపేట మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖలు సమావేశం ఏర్పాటు చేసి ఏ నిర్ణయం అయినా ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణ తేదేపా అశ్వారావుపేట నియోజక ఇంచార్జి కట్రం స్వామి దొర, మండల అద్యక్షులు నార్లపాటి శ్రీను వాసు రావు, అంకోలు వెంకటేశ్వరరావు,పోతురాజు నాని లు ఆంధ్రా మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసారు.