స్పాట్‌లోనే రూ.10 వేలు ఇస్తాం..

We will give Rs.10 thousand on the spot..హీరో సాయిరాం శంకర్‌ నటించిన మరో విభిన్న కథా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. దర్శకుడు వినోద్‌ కుమార్‌ విజయన్‌ ఈ చిత్రాన్ని తన వినోద్‌ విహాన్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌తో పాటు గార్లపాటి రమేష్‌ విహారి సినిమా హౌస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 7న గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు మంగళవారం చిత్ర యూనిట్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది.
హీరో సాయిరామ్‌ శంకర్‌ మాట్లాడుతూ, ‘ఇందులో నాది లాయర్‌ పాత్ర. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, క్రిమినల్‌ లాయర్‌ని. అయితే క్రిమినల్‌ లాయరా? లేక క్రిమినలా? జరిగిన క్రైమ్‌తో ఈ లాయర్‌కు సంబంధం ఉందా? లేదా? ఇలా ఈ సినిమా క్రైమ్‌ సస్సెన్స్‌తో ఇంటెన్సిటీ థ్రిల్లింగ్‌ ఇస్తుంది. దర్శకుడు వినోద్‌ విజయన్‌ ప్రొడ్యూస్‌ చేసిన ఒక సినిమా బెర్లిన్‌ అవార్డ్‌ను గెలుచుకుంది. ‘ఒట్టాల్‌’ అనే ఆ సినిమా నేషనల్‌ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అలాగే ‘పట్టుకుంటే పదివేలు.. ఈ సినిమాలో విలన్‌ ఎవరో కనిపెడితే మీరే హీరో’ ఇదే కాంటెస్ట్‌. మీకు ఒక కూపన్‌ ఇస్తారు. ఇంటర్వెల్‌ తర్వాత ఆ కూపన్‌లో విలన్‌ ఎవరో చెప్పి.. సెకండాప్‌ చూసిన తర్వాత మీరు రాసింది కరెక్ట్‌ అయితే.. స్పాట్‌లో పదివేలు ఇస్తారు. ఇలా మొత్తం ఒక 50 సెంటర్స్‌లో మేము ఇవ్వబోతున్నాం. ఈ సినిమాపై ఇంత నమ్మకం ఎందుకంటే.. స్క్రీన్‌ప్లే అలా ఉంటుంది. క్లైమాక్స్‌ వరకు విలన్‌ ఎవరో కనిపెట్టలేరు. అంత గొప్పగా కథ, స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ సినిమాను రెడీ చేశారు’ అని అన్నారు.
‘ఒక మంచి మూవీతో ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. అందరూ ఈ సినిమాను చూసి హర్షిస్తారని ఆశిస్తున్నాం’ అని నిర్మాత గార్లపాటి రమేష్‌ చెప్పారు. దర్శకుడు వినోద్‌ విజయన్‌ మాట్లాడుతూ, ‘అందరూ ఈ సినిమా చూసి బాగా ఎంజారు చేస్తారని భావిస్తున్నాను. సాయిరామ్‌ శంకర్‌ చాలా కొత్తగా కనిపిస్తారు’ అని తెలిపారు.
ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లకు తగ్గకుండా
రిలీజ్‌ చేస్తున్నాం.
– శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌
బాపిరాజు