– స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్
– ముంపు ప్రాంతాలలో మండల అధికారుల బృందం ఇంటింట సర్వే
నవతెలంగాణ- తాడ్వాయి
ఇటీవల విస్తీర్ణంగా కురిసిన వర్షాలకు మండలంలో జంపన్న వాగు వరద ప్రవాహానికి తీవ్రంగా నష్టపోయిన మేడారం, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపెళ్లి, కాల్వపెళ్లి, కొత్తూరు గ్రామాలలో నష్టపరిహారం ఎంత జరిగింది? ఏమేమి వరదలో కొట్టుకుపోయాయి అనే స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం ముమ్మరంగా కొనసాగింది. ఐదు బృందాలుగా ఏర్పడి జంపన్న వాగు పరిసర ప్రాంతాల గల గ్రామాలను సర్వే నిర్వహిస్తున్నారు. వరద వృద్ధికి ప్రాణ నష్టం మూగజీవాలు ఆస్తి ఇల్లు తదితర అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నారు. మేడారం లో స్థానిక సర్పంచ్ చిడం బాబురావు తో కలిసి ఇల్లు, ఇల్లు తిరిగి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కో ఇంట్లో ఏ రకమైన నష్టం జరిగింది, ఆస్తి ఎంత జరిగింది, పశువులు ఏమైనా మృతి చెందాయా ఎంత ఖరీదైన పశువులు మృతి చెందాయి ఎన్నిండ్లు కూలిపోయాయి అంశాలపై పూర్తి సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలో మిగతా గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ కార్యదర్శులు, అక్కడి గ్రామాల సర్పంచులతో, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వే అనంతరం పూర్తి అంచనా నివేదిక విలువ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి అందిస్తామన్నారు. ప్రభుత్వం నుండి సహాయం రాగానే వరద బాధితులందరినీ ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్, ఎంపీ ఓ శ్రీధర్, ప్రోటోకాల్ అధికారి బొప్ప సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సతీష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.