బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం…

We support the victim's family...– నిత్యవసర సరుకులు పదివేల ఆర్థిక సాయం అందించిన ఆత్రం సుగుణ..
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైన గోల్కొండ పోచ మల్లు కుటుంబాన్ని కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ మంగళవారం పరామర్శించారు. సందర్భంగా వారి కుటుంబానికి పదివేల రూపాయలు నిత్యవసర సరుకులు దుప్పట్లను అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. మంత్రి సీతక్క తో మాట్లాడి వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ద్వారా రూ.95000 తక్షణ సాయం అందించడానికి తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.. అనంతరం వారం రోజుల క్రితం బెహరన్ దేశంలో మృతి చెందిన కూకటికారి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. తగిన సహకారం అందిస్తామని తెలిపారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఏఎంసీ డైరెక్టర్గా నియమితులైన రేగుంట ప్రదీప్ ను ఆత్రం సుగుణ, చిందం చంద్రయ్య శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుగులావత్ రవి, ఏఎంసీ డైరెక్టర్ ప్రదీప్, నాయకులు చిందాం చంద్రయ్య, జాడి వెంకటయ్య, కే శ్రీనివాస్, జాడి రాజన్న, కోవ శాంతయ్య వెంకటస్వామి నరసయ్య అశోక్ కూకటికారి శ్రీనివాస్ గొ ల్కొండ రాజన్న, కార్తీక్ దుర్గాప్రసాద్, సుద్దాల వెంకటేష్, సత్తన్న గోల్కొండ రామన్న లింగన్న, తదితరులు పాల్గొన్నారు.