ఎస్సారెస్పీ కెనాల్ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకుంటామని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కెనాల్ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొలనుపల్లి బాధిత రైతులకు ప్రైజ్ మనీ ఇవ్వడానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. పంట సాగునీరుకు జలాలు రావాలంటే కెనాల్ కాలువ నిర్మాణం తప్పనిసరి అని తెలిపారు. భూములను కోల్పోతున్న సదరు రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. రైతుల అభీష్టం మేరకే ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో డిటీ శ్రీనాథ్, ఆర్ఐ చంద్రమోహన్, ఏఆర్ఐ సంధ్యారాణి, సర్వేయర్ వీరస్వామి, ఎస్సారెస్పీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.