గన్ ఫౌండ్రి లోని ఆర్య సమాజ్ లో బీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిం చారు. పార్టి ఎంపీఅభ్యర్థి మాధవీలత పాల్గొని మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కాషాయ జెండా ఎగరవేస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి కానుక ఇస్తామన్నారు. అందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్రఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్ భీశ్వ, పెద్ద ఎత్తున మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.