– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జూపల్లి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) సంస్థను, మాదాపూర్ లోని శిల్పారామాన్ని ఆయన సందర్శించారు. నిథమ్ అకడమిక్ బ్లాక్‌లోని క్లాస్ రూంలు, హాస్పిటాలిటీ బ్లాక్‌లోని కిచెన్, బేకరీ, ట్రైనీ రెస్టారెంట్, మాక్ రూమ్స్, తరగతి గదులను మంత్రి పరిశీలించారు. విద్యార్థులు, బోధన, భోదనేతర ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక, ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందనీ, ఫలితంగా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయిని చెప్పారు.