
– కార్మికుల సంఘాల జిల్లా చైర్మన్ వెంకట్ గౌడ్ డిమాండ్
నవతెలంగాణ- తాడ్వాయి
గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ను గ్రామ పంచాయతీ కార్మికులు వర్షాన్ని లెక్కచేయకుండా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి అనంతరం DPO గార్కి మెమోరండం ఇవ్వడం జరిగింది అనంతరం గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ వెంకట్ గౌడ్ CITU జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈరోజుకు గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 22 రోజులుగా 50 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారులు తో విచ్చిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు 80 వేల రూపాయలు జీతం ఉన్నవారు సమ్మె చేస్తున్న 8000 రూపాయలు జీతం ఉన్నవారు సమ్మె చేయవద్దని బెదిరిస్తున్నారు ఇలాంటి బెదిరింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే సంబంధిత మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు మీద గ్రామ పంచాయతీ కార్మికుల కు సన్మానం చేసారు తప్ప వాళ్ళ జీతాలు పెంచలేదని శాలువా కప్పుతే కడుపు నిండదని జీవితాలు పెంచాలని గ్రామపంచాయతీ కార్మికులు కరోనా సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేశారని అలాంటి గ్రామపంచాయతీ వర్కర్స్ ను పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుంపటి ప్రేమ నటిస్తున్నది వెంటనే గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు మరింత ఉధృతంగా నిర్వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చేర్మన్ వెంకట్ గౌడ్ తో పాటు CITU జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ రాజనర్సు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతిరాం నాయకులు బాలనర్సు కారోబార్ యూనియన్ నాయకులు, ప్రభాకర్ దుర్గగౌడ్ భద్రప్ప శివ్వగౌడ స్వామి, సాయిలు, శ్యాం, రాజన్న, తదితరులు పాల్గొన్నారు