నవతెలంగాణ-తిరుమలగిరి
తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి పనులను ప్రజల వద్దకు వెళ్లి అర్ధమయ్యే విధంగా ప్రచారం చేసి మూడవసారి మళ్లీ ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్‌న గెలిపించుకుంటామని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ కొమ్మిని స్రవంతి సతీష్‌కుమార్ అన్నారు.గురువారం మండలకేంద్రంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ పదేండ్ల కాలంలో నియోజకవర్గంలో దాదాపుగా 6,500 కోట్ల రూపాయలకు పైగా ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారన్నారు.నిత్యం ప్రజలతో ఉంటూ కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటూ, ఆదుకుంటూ ప్రజారంజక పాలన సాగించారన్నారు. దళితులు ఆర్థికంగా స్థిరపడాలని తిరుమలగిరి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 2500 కుటుంబాలకు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందించి వారు వ్యాపారం చేసుకునే విధంగా దోహదపడ్డారన్నారు.దళితులకే కాకుండా సబ్బండవర్గాలకు సంక్షేమ పథకాలతో చేయూతనందించారన్నారు. తుంగతుర్తి వరప్రదాయాని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తీసుకొచ్చి ఏండ్ల తరబడి బీడులుగా ఉన్న నేలలను తడిపి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపారన్నారు. 225438 ఎకరాల భూమి సాగులోకి తీసుకొచ్చారన్నారు.భూమి మోయలేని పంట దిగుబడి ఇచ్చే విధంగా కషి చేసి, పండిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా మార్కెట్లను విస్తరించి వ్యాపారం వద్ధి చేశారని ప్రభుత్వ పథకాలు పేదలందరికీ అందించారన్నారు. ప్రజల మనిషిని మరోసారి గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.65 ఏండ్లలో జరగని అభివద్ధిని పదేండ్లలో చేసి చూపించిన గాదరి ప్రగతిని ప్రతి గడపకు వెళ్లి అర్థమయ్యేలా తెలియపరచి తుంగతుర్తి గడ్డపై గులాబీజెండా యాట్రిక్ ఎగరవేయడంలో ప్రధాన భూమిక పోషిస్తామన్నారు.