నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపెల్లి గ్రామంలో వీధిలైట్ లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెదిరె మెగా రెడ్డి, వెదిరె విజేందర్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి 140 ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు మంజూరు చేశారు. గురువారం గ్రామంలోని కాంగ్రెస్ నాయకులతో కలిసి వెదిరె విజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాల వెంకన్న యాదవ్ సీట్ లైట్లను ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో జిల్లా లోనే కొంపెల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు .వీధిలైట్లు ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాం యాదయ్య మక్కెన అప్పారావు, పిఎసిఎస్ డైరెక్టర్ మాదరగొని యాదయ్య, మాజీ సర్పంచ్ బోయపర్తి లింగయ్య, యువజన కాంగ్రెస్ నియోజవర్గ ఉపాధ్యక్షులు బోయపర్తి ప్రసాద్, కుమార్, యాదయ్య, మనోజు, వెంకన్న, మహేష్, నరసింహ, శ్రీశైలం తదితరులు ఉన్నారు.