మీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తాం : వెంకటేష్‌

We will make you all laugh: Venkateshవెంకటేష్‌, అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మహేష్‌ బాబు లాంచ్‌ చేశారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ గ్రౌండ్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ, ‘నిజామా బాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ జరగడం చాలా హ్యాపీగా వుంది. మీ లవ్‌కి, సపోర్ట్‌కి థ్యాంక్స్‌. నాకు ఎన్నో హిట్లు ఇచ్చారు. ‘బొబ్బిలిరాజా, చంటి, గణేష్‌, సీతమ్మ వాకిట్లో.., ఎఫ్‌ 2, ఎఫ్‌3’ ఇలా ఎన్నో విజయాలు ఇచ్చారు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’తో రాబోతున్నాం. సంక్రాంతి సినిమా ఇంట్లో ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలి. తప్పకుండా ఈ సినిమాని మీరు ఎంజారు చేస్తారు. ఫుల్‌ ఎంటర్‌ టైన్మెంట్‌, సాంగ్స్‌.. ఇలా అనిల్‌ హోల్‌సమ్‌ ఎంటర ్‌టైనర్‌ని ఇచ్చారు. మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాతో పాటు ‘గేమ్‌
ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’ అన్నీ పెద్ద హిట్లు కావాలని కోరుకుంటున్నాను. దిల్‌ రాజు బ్యానర్‌లో చేసిన నాలుగు సినిమాలు సూపర్‌ హిట్లు అయ్యాయి. దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్‌. ఐశ్వర్య, మీనాక్షి చాలా అద్భుతంగా నటించారు. పెళ్ళాలకి మీ ఫ్లాష్‌ బ్యాకులు చెప్పొద్దు(నవ్వుతూ). సినిమా చూడండి. మామూలుగా ఉండదు’ అని తెలిపారు.
‘మా 58వ సినిమా ఈవెంట్‌ ఇక్కడ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. ఎంతోమంది హీరోలు, దర్శకులు సపోర్ట్‌ చేస్తే ఈ స్థాయిలో ఉన్నాం. అనిల్‌ మా బ్యానర్‌లో ఆరు సినిమాలు చేసి ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. ఈ ఏడాది మా సంస్థకు బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌ ఇయర్‌. పాన్‌ ఇండియా సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ 10న రిలీజ్‌ అవుతుంది. మా బ్యానర్‌లో ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ లాంటి సూపర్‌ హిట్స్‌ చేసిన వెంకటేష్‌ సినిమా జనవరి 14న వస్తోంది. అలాగే ‘డాకు మహారాజ్‌’ని నైజంలో మేం రిలీజ్‌ చేస్తున్నాం. అందుకే ఇది మాకు బ్లాక్‌ బస్టర్‌ పొంగల్‌’. ఈ సినిమాకి రండి.. హాయిగా నవ్వుకోండి’ అని దిల్‌ రాజు చెప్పారు.
– ట్రైలర్‌లో చూసింది కొంచెమే.. సినిమాలో చాలా ఉంది. ఇదొక టిపికల్‌ జోనర్‌ సినిమా. వెంకటేష్‌ అద్భుతంగా నటించారు.ఖచ్చితంగా పండక్కి చాలా పెద్ద హిట్‌ కొట్టబోతున్నాం. అందరూ ఫ్యామిలీతో ఎంజారు చేస్తారు. సంక్రాంతికి మీ ఫ్యామిలీ అంతా థియేటర్స్‌కి వచ్చేయండి. కడుపుబ్బా నవ్వించి బయటికి పంపుతాం.
– డైరెక్టర్‌
అనిల్‌ రావిపూడి