ఇటీవల పలువురు నిర్మాతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇండిస్టీ గురించి చర్చించిన విషయాలు గురించి తెలియజేసేందుకు సోమవారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట్లాడుతూ, ‘సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఛాంబర్ కోరగానే ‘ఈగల్’ రిలీజ్ డేట్‌ని ఫిబ్రవరి 9కి మేకర్స్ మార్చుకున్నారు. అయితే అదే రోజు భైరవకోన తమ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. అనిల్ సుంకరతో, రాజేష్‌తో మాట్లాడితే వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ డేట్‌ని ఫిబ్రవరి 16కి మార్చుకున్నారు. 9న ‘యాత్ర 2’ వాళ్ళు కూడా రిలీజ్ పెట్టుకున్నారు. పొలిటికల్ ఇష్యూస్ వల్ల డేట్ ముందే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అలాగే రజనీకాంత్ ‘లాల్ సలాం’ కూడా రిలీజ్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు పరిశ్రమ సమస్యలే కాదు పరిష్కారాలు కూడా మీరే తీసుకురండి, ప్రభుత్వాన్ని నుంచి ఏం సహాయం కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు. దీంతో ఉన్న సమస్యలన్నిటి మీద ఎల్లుండి ఈసీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో సమస్యల పరిష్కారాలను తీసుకుని అతిత్వరలో సీఎంని కలుస్తాం’ అని తెలిపారు.