గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమిస్తాం

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్యమాలు నిర్వహిస్తామని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మిడియా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ఎండి అల్తాఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి హాజరై మాట్లాడుతూ..  ఆదివాసి గిరిజన జనాభా అధికంగా ఉన్న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చెయ్యకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమన్నారు.  ములుగు జిల్లాలో పేరుకే గిరిజన యూనివర్సిటీని నడుపుతుందని, పూర్తిస్థాయిలో యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తర్వాత చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పేరుకు మాత్రమే గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయించారు తప్ప దాని అభివృద్ధి చేయడంలో విఫలమైందని అన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను మొత్తం కార్పొరేట్ శక్తుల కట్టబెట్ట కుట్ర చేస్తుందని తక్షణమే నూతన జాతీయ విద్యా అమలు చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం పరిపాలన సంవత్సరం పూర్తయినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైందని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరచిపోయి పరిపాలించడం సిగ్గుచేటు అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడమే భారంగా మారిందని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతనంగా అమలు చేస్తున్న మెనూను పూర్తిస్థాయిలో అమలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పడం పునరాలోచించాలని అన్నారు భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యావేత్తల కవితల పట్ల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదం తిరుపతి జిల్లా కార్యదర్శి ఆత్రం నగేష్, షేక్ అల్టాఫ్, ఖాసీఫ్, శామీర్, మాషి, నందు, రమేష్ నాయకులు