నవతెలంగాణ-ఆసిఫాబాద్
అంగన్‌వాడీలకు సంబంధించి మంత్రి సీతక్క ఇచ్చిన హామీకి సంబంధించిన జీఓ విడుదల అయ్యేంత వరకు పోరాటం కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా నాయకుడు కృష్ణమాచారి అన్నారు. 12వ రోజు కలెక్టరేట్ ఎదుట దీక్షలో అంగన్‌వాడీలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం మంత్రి సీతక్క హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సందర్భంలో మంత్రి హామీకి సంబంధించి జీఓ వచ్చి అది అమలు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. జీఓ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాలోని అంగన్‌వాడీలు పాల్గొన్నారు.