15 ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లు తెరుస్తాం

సామ్‌సంగ్‌ వెల్లడి
హైదరాబాద్‌: ప్రస్తుత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 15 ప్రీమియం ఎక్స్‌ పీరియన్స్‌ స్టోర్లను తెరువాలని లక్ష్యం గా పెట్టుకున్నామని ఆ కంపెనీ ఎక్స్‌ క్లూజివ్‌ బ్రాండ్‌ షాప్స్‌ హెడ్‌ రాహుల్‌ సింగ్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో నూతన స్టోర్‌ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశంలో తమకు నాలుగో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్‌ అని తెలిపారు. మరో 11 అవుట్‌లెట్‌లను అందుబాటులోకి తేనున్నా మన్నారు. వీటిని 8-10 నగరాల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. తమ రిటైల్‌ మార్కెట్‌లో తెలుగు రాష్ట్రాలు కీలక వాటాను కలిగి ఉన్నాయన్నారు. తెలంగాణలో 56, ఎపిలో 58 స్టోర్లు ఉన్నాయన్నారు. తెలంగాణలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల వ్యాపారంలో 60 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నామన్నారు. నూతన స్టోర్‌లో తొలి వారంలో పలు ప్రత్యేక డిస్కౌంట్‌లను అందిస్తున్నామన్నారు.