మున్సిపల్ పాలకవర్గం అవినీతిపై కలెక్టర్ తో విచారణకు ఆదేశిస్తాం అని పి సి సి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్,పట్టణ అధ్యక్షులు సాయిబాబ గౌడ్ లు అన్నారు.. పట్టణంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని గతంల నియోజకవర్గం అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ అని గత పదేళ్లలో అభివృద్ధి జరుగలేదు అని అన్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే 6 గ్యారంటీల అమలు ఫైల్ పై రేవంత్ రెడ్డి సంతకం చేశారు అని 48 గంటల్లో రెండు గ్యారంటీలు అమలు చేసాం అని 100 రోజుల్లో మిగిలిన గ్యారంటీలు అమలు చేస్తాం అని అన్నారు, నియోజకవర్గంలో ప్రధాన జీవనధారం అయినా వ్యవసాయం పై తోడ్పాటు అందిస్తాం అని పెండింగ్ లో ఉన్న ఎత్తిపోతల పథకాలు, ప్రస్తుతం ఉన్నవాటికి మారమ్మతులు చేస్తాం అని, లక్కంపల్లి సెజ్ లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం అని మద్దత్తు ధరలు కల్పిస్తాము అని అన్నారు, ఆర్మూర్ పట్టణంకి మాస్టర్ ప్లాన్ రూపొందిస్టమ్ అని లేదర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తం అని అన్నారు, మునిసిపల్ అవినీతిపై జిల్లా ఇంచార్జ్ మంత్రి రాగానే గత నాలుగేళ్లలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ చేయిస్తాం అని అన్నారు, మున్సిపల్ అవిశ్వసం కు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని అది BRS పార్టీ అంతర్గత వ్యవహారం అని అన్నారు, BRS కు చెందిన మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనేది ఊహగానలే అని అవినీతి పరులను చేర్చుకుని ఆ మరకలను కాంగ్రెస్ పార్టీ అంటించుకోదు అని అన్నారు, రానున్న పార్లమెంట్ మరియు స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ బలోపేతం కొరకు ఎవరిని పార్టీలో చేర్చుకోవాలో పార్టీ అధిష్టానంతొ చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు, పదేళ్లు కాంగ్రెస్ పార్టీ పక్షన ఉండి పార్టీ మనుగడకు కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు సమూచిత స్థానం కల్పిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ మాజీద్, షేక్ అసిఫ్, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు అబ్దుల్ ఫాయీమ్,మీసాల రవి, బట్టు శంకర్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాల కిషన్, బిసి సెల్ అధ్యక్షులు దొండి రమణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు అఫ్రోజ్, సీనియర్ నాయకులు అజ్జు, అబ్దుల్ బారి, దాసరి అనిల్, చరణ్ రెడ్డి, పూల నర్సయ్య, ఉస్మాన్, నల్ల గంగాధర్, పాషా, అభినవ్, భగత్, దినేష్, విజయ్, కిషోర్, మురళి, నవీద్, వాసి, రాజకుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.