– సీఎంతో కోకో కోలా కంపెనీ ప్రతినిధుల చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర పారిశ్రామికాభివద్ధిలో పాలుపంచుకునేందుకు హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ కంపెనీ ముందుకొచ్చింది. సంస్థ పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శని సారధ్యంలోని ప్రతినిధి బందం సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టామనీ, సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో తాము తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉందని బృంద సభ్యులు సీఎంకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని తెలిపారు. అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని వారు సీఎంకు తెలిపారు. పెట్టుబడులకు రక్షణ కల్పించటంతో పాటు పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమల్లో ఉంటుందని సీఎం అన్నారు.