నవతెలంగాణ – నెల్లికుదురు
కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండలంలోని ఆలేరు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆరే కృష్ణ పద్మ దంపతుల కుమార్తె వర్శిత పుష్పాలకారణ వేడుకలో పాల్గోని చిన్నారిని ఆశీర్వదించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ కార్యకర్త అయినా ఏ సమయంలోనైనా ఏ ఆపద వచ్చిన నా దగ్గరకు వచ్చి చెప్పినట్లయితే వారి సమస్యలను తక్షణమే పరిశీలించే విధంగా కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్త అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డి, ఎంపీటీసీ షైనాజ్ నజీమ్ ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలేరు మల్లేశం గూడూరు మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకన్న, యుగేందర్ వీరన్న లక్ష్మీనారాయణ నరసయ్య వీరయ్య నరేష్ మండల, గ్రామ నాయకులు, పాల్గొన్నారు.