కార్యకర్తలను కాపాడుకుంటాం: బీసు హరికృష్ణ

నవతెలంగాణ పెద్దవంగర: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు రామచంద్రు (60) వృద్ధాప్యంతో మృతి చెందారు. మృతుడి పార్థివ దేహానికి ఆయన మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్ తో కలిసి సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ..కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. అధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆయన వెంట
గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాక శ్రీనివాస్, సోంమల్లు, రజినీకాంత్, వల్లపు మహేష్, రామ్ చరణ్ , రమేష్, శ్రీను, వెంకన్న, ఆకుతోట వెంకన్న, కుమార్, హరీష్, బాలకృష్ణ, సోమన్న తదితరులు ఉన్నారు.