కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం: శర్మ

నవతెలంగాణ పెద్దవంగర: బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటామని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఈదురు బిక్షం (68) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న శర్మ, మృతుడి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యకర్తలను ఆపదలో ఆదుకుంటున్నారని చెప్పారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చిలుక బిక్షపతి, పీఏసీఎస్ డైరెక్టర్ అనపురం రవి గౌడ్, యాదవ సంఘం నాయకులు నిమ్మల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు జలగం బక్కమ్మ సోమయ్య, నాయకులు చిలుక పస్తాల వెంకటయ్య, వీరభద్రి, ఎడ్ల యాకూబ్ రెడ్డి, చిలుక సిద్దు, జలగం యాకయ్య, దంతాలపల్లి ప్రశాంత్, ఓరుగంటి మహేష్, చిలుక మహేష్, చిలుక సందీప్, చెరకు పెద్ద యాకన్న తదితరులు ఉన్నారు.