
నవతెలంగాణ – పెద్దవంగర
పార్టీ కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్ తండ్రి సోమేంద్రి (68) ఇటీవల వృద్ధాప్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని చెప్పారు. గ్రామాల్లోని సమస్యలను ప్రజలు నేరుగా నా దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించాలని కృషి చేస్తానని అన్నారు. మండలంలో విచ్చలవిడిగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయని, గుడుంబా నియంత్రించాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడి గుడుంబా విక్రయాలను అరికట్టాలని ఆదేశించారు. ఆమె వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, బానోత్ వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, బానోత్ వెంకన్న, జాటోత్ వెంకన్న, అనపురం రవి, యూత్ నాయకులు అనపురం వినోద్, పవన్, ప్రవీణ్, సుధారాణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.