కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

We will protect the activists like an eyeball– పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి 

నవతెలంగాణ – పెద్దవంగర
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంట్లకుంట, పోచంపల్లి, ఉప్పెరగూడెం, పెద్దవంగర గ్రామాల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇటీవల కాలంలో వేరువేరు కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, ఆపదలో వారికి అన్ని విధాల తోడుగా ఉంటామని చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రంగు మురళి గౌడ్, విజయ్ పాల్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, బానోత్ సీతారాం నాయక్, ఓరుగంటి సతీష్, బీసు హరికృష్ణ గౌడ్, బానోత్ వెంకన్న, రవీందర్ రెడ్డి, గద్దల ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, బెడద మంజూల, లింగమూర్తి, జాటోత్ వెంకన్న, ఆవుల మహేష్, సుంకరి అంజయ్య, అనపురం చంద్రమౌళి, చిలుక సంపత్, ధర్మారపు వెంకన్న, రాంపాక అనిల్, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.