ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం

 

యాదయ్యను పరామర్శిస్తున్న సీఎల్ శ్రీనివాస్ యాదవ్
యాదయ్యను పరామర్శిస్తున్న సీఎల్ శ్రీనివాస్ యాదవ్
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ తలకొండపల్లి: మండల పరిధిలోని ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్  ఓమ్ని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని చీపునుంతల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఉదరి పర్వతాలు యాదవ్ ను కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని రూ.5వేలు ఆర్థిక సహాయం అందజేసి డాక్టర్లను మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బత్తుల శేఖర్ గౌడ్, శివరాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
వెల్జాల్  గ్రామానికి చెందిన బోయ రాములమ్మ వృధ్యాపథంతో మృతి చెందిది విషయం తెలుసుకున్న బీఆర్ఎస్  పార్టీ సీనియర్ నాయకుడు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.3వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యుడు యాదయ్య, నర్సింహ, అభిలాష్ గౌడ్, అంజి, పరంధాములు, రవి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం
   మాధాయపల్లి గ్రామానికి చెందిన ఆయిల్ రాఘవేందర్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్  పార్టీ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ,3వేల రూపాయలు ఆర్థిక సహాయ అందజేశారు. ఈ కార్యక్రమంలో బయ్య యాదయ్య, శ్రీను, సత్యం గౌడ్, శ్రీరామ్, శ్రీకాంత్, అవినాష్, గౌడ్, అభిలాష్ గౌడ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.