
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో గతవారం రోజుల కిందట కురిసిన భారీవర్షాలకు పత్తి పంట దెబ్బతినగా గురువారం జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ మాల్తుమ్మెద ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. మండలం లోని ఆయా గ్రామాలలో భారీ వర్షాల పత్తి పంట అధికంగా నష్టం వాటిల్లడంతో రైతుల రోడ్ ఎక్కడంతో జిల్లా అధికార యంత్రాంగం కాటేపల్లి శివారులో జిల్లా అధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలను పరిశీలించారు. దీంతో జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, మాల్తుమ్మెద ఏరువాక కేం ద్రం శాస్త్రవేత్తలు అనిల్ రెడ్డి, రేవంత్లతో కలిసి పత్తి పంటను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త అనిల్ రెడ్డి మాట్లాడుతు పత్తి పంటకు కావాల్సిన నీటిశాతం కంటే అధిక వర్షాలు కురియడం వలన పత్తి పంట ఎండిపోవడం ప్రారం భం అయిందని తెలిపారు. వాతావరణంలో జరిగిన మార్పుల పలితంగా ఈ ఘటన చోటుచేసుకున్నదని తెలిపారు. అయితే ఏదైతే ఎండిపోయిన పత్తి మొక్కలు ఉన్నాయో అవి తిరిగి చిగురిస్తాయని, పంట దిగుబడి మాత్రం తక్కువగా ఉంటుందని తెలిపారు. అధిక వర్షాల కారణంగా పత్తి పంటకు నష్టం జరిగిందని తెలిపారు. అనంతరం పత్తి పంట నష్టపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ కమిషనర్ దృష్టికి తీసుకవెళ్తామని తెలిపారు. అయితే రైతులు తాము పత్తి పంట సాగు చేసి అధిక మొత్తంలో నష్టపోయామని,తమను అదుకోవాలని వ్యవసాయాధికారిని కోరగా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కిషన్, ఏఈవో లురూప, మాధవి, రాజ్యలక్ష్మి, కాటేపల్లి గ్రామస్తులు మల్లప్ప పటేల్, విట్టల్, జానీ, మొగులగౌడ్ గంగాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.