– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
నవతెలంగాణ – అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని ప్రతి మారుమూల పల్లెకు బీటి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన గ్రామీణ రోడ్ల ను వీటి రోడ్లుగా మార్చడానికి జీవో నెంబర్ 565 ద్వారా ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఉప్పునుంతల నుండి పలకపల్లి వరకు నాలుగు కోట్ల 50 లక్షలు, కన్య తండా నుంచి ఐనల్ వరకు రెండు కోట్ల యాభై లక్షలు, అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తండా రోడ్డుకు రెండు కోట్ల 50 లక్షలు, అదేవిధంగా రోడ్ల భవనాల శాఖకు సంబంధించి సర్వ రెడ్డి పల్లి నుంచి కల్వకుర్తి హైవే రోడ్డు వరకు 36 కోట్లు, శ్రీశైలం హైవే కొండారెడ్డిపల్లి స్టేజి నుండి ఫోన్ కంపల్లి వరకు రూ.16 కోట్లు, ఉల్పర మొలగర డిండి రివర్ పైన బ్రిడ్జి నిర్మాణానికి రూ.37 కోట్లు, ఎం ఆర్ ఆర్ మరో రూ.20 కోట్లు, మొత్తం రూ.150 కోట్ల విలువ చేసే రోడ్లు నియోజకవర్గంలోని ప్రతి మారుమూల తండాకు పల్లెకు బీటి రోడ్ల నిర్మాణం కానుంది అన్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సహకారంతో మద్దిమడుగు మారడుగుల మాదాపూర్ ఐనోల్ గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అదేవిధంగా వెల్టూరు సిద్ధాపూర్ ఎల్లమ్మ రంగాపూర్ అంబటిపల్లి గ్రామాలలో నూతనంగా బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అచ్చంపేట అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట అనంతరెడ్డి, అంతటి మల్లేష్, లోక్యా నాయక్, తదితరులు ఉన్నారు.