
– కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకరి శ్రీను- చైతన్య
నవతెలంగాణ – పెద్దవంగర
మండల ప్రజలకు త్వరలోనే ఉచితంగా శుద్ధ జలాన్ని అందిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకరి శ్రీను- చైతన్య దంపతులు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లో నూతన వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం తమ సొంత ఖర్చులతో బోరు వేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాటర్ ప్లాంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు ఉచితంగా శుద్ధ జలాన్ని అందిస్తామని చెప్పారు. గతంలో సైతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు రూ. 80 వేల విలువచేసే ఆల్ ఇన్ వన్ లు, పరీక్ష సామాగ్రిని, ప్రత్యేక తరగతుల నిర్వహణలో సాయంత్రం స్నాక్ అందించినట్లు తెలిపారు. వీటితో పాటుగా త్వరలోనే 1000 మంది వృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, తాము సంపాదించిన వార్షిక ఆదాయంలో కొంత మొత్తం పేద ప్రజల కోసం వెచ్చిస్తామన్నారు. విద్యార్థులకు, వృద్ధులకు, గ్రామ ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని, రాబోయే రోజుల్లో మండల వ్యాప్తంగా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంకెపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. సుంకరి శ్రీను- చైతన్య దంపతులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం వారు ఎంచుకున్న లక్ష్యాలు, ఆశయాలు ఎంతో ఉన్నతమైనవని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు పాటుపడాలని, తమకు తోచిన స్థాయిలో ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బోనగిరి లింగమూర్తి, వెం సుంకరి అంజయ్య, సుంకరి ప్రశాంత్, కుటుంబ సభ్యులు సుంకరి నర్సమ్మ, యాకయ్య, శైలజ, చిలుక సరోజ, సంపత్, ఉడుగు జయమ్మ, కృష్ణస్వామి, ప్రభాస్, నవీన్, శోభ, నరేష్, కృపమై, వెన్నెల, గ్రామస్తులు పాల్గొన్నారు.