నవతెలంగాణ – జన్నారం
పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం వరమని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో దోహద పడుతుందన్నారు. ఈ పథకం వల్ల అనేక మందికి లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందజేస్తుందని తెలిపారు. పేదల సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపిట వేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.