– టీజీఎస్‌ఆర్టీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలకు సురక్షిత ప్రయాణం కల్పిస్తామంటూ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఫరుఖ్‌నగర్ డిపోనకు చెందిన ఓ కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చింది. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించినట్టు ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖపరమైన సంస్థ చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నది. టీజీఎస్‌ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని పేర్కొన్నది. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపింది.