– విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దండి
– మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ – రెంజల్తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, తాగునీటి పై ప్రత్యేక దృష్టి సారించిందని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండలంలోని పేపర్ మిల్, కందకుర్తి, నీలా గ్రామాలలో పర్యటించి గ్రామాల సమస్యలపై స్థానిక నాయకులు కార్యకర్తలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉందని, ఆయా సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. నీల పాఠశాలలో మౌలిక సదుపాయాలకు ఆరు లక్షలు, గుంతపూర్చడానికి రెండు లక్షలు, పాఠశాల ఆవరణ శుభ్రపరచుకోవడానికి మరో రెండు లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిట్ తీసుకురావాలని ఆయన విద్యార్థిని విద్యార్థులకు ముచ్చటించారు. ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రధానోపాధ్యాయులు ఈ .శంకర్ కు సూచించారు. పొగాకు సీజన్ లో విద్యార్థులు గైరాజరవుతున్నారని, ఆయన దృష్టికి తీసుకురాగా, ఇలాంటి సమయంలో వాళ్ల భవిష్యత్తును పాడు చేయరాదని, వారిని శ్రద్ధగా చదువ నీయండి అని విద్యార్థి తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, గణేష్ రావు, పీఆర్ టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, నాయకులు గంగా కృష్ణ, సిహెచ్ రాములు, సురేందర్ గౌడ్, జావీద్ ఉద్దీన్, ధనుంజయ్, గయా సుద్దీన్, సాయి రెడ్డి, లచ్చే వార్ నితిన్, బన్షియ నాయక్, ఫర్ఖన్, మోహన్, ఎమ్మెల్యే రాజు, కాంగ్రెస్ యువజన నాయకులు కార్తీక్, గైన కిరణ్, శంషాద్దీన్, సద్దాం, శభాజ్, తదితరులు పాల్గొన్నారు.