– కౌన్సిలర్ రజిత వార్డు ప్రజలచే సన్మానం అందుకున్న కౌన్సిలర్
నవతెలంగాణ – దుబ్బాక
పదవి కాలం ముగిసిందని బాధపడేది లేదని, పదవిలో లేకున్నా.. ప్రజాసేవలోనే ఉంటామని ఒకటో వార్డ్ కౌన్సిలర్ నిమ్మ రజిత గిరి స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన 1వ వార్డు కౌన్సిలర్ నిమ్మ రజిత, డిప్యూటీ కలెక్టర్ ఎన్.వై.గిరి దంపతులు ఆదివారం దుబ్బాకలోని ఒకటో వార్డు బీసీ కాలనీలో ఆ వార్డు ప్రజలచే ఘన సన్మానం అందుకున్నారు. దుర్గేష్,ఎలేందర్, గోరిటాల పాండరీ,బాల్ నర్సయ్య,రజియ,బాల లలిత పలువురున్నారు.