నవతెలంగాణ – ముధోల్
గత పాలకుల నిర్లక్ష్యంతో కోట్ల రూపాయల నిధులు వృధా అయిన బ్రహ్మణ్ గావ్ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరిస్తామని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. ముధోల్ ఉమ్మడిమండలంలోని బ్రహ్మణ్ గావ్ ఎత్తిపోతల పథకం ను రైతులతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 6 వేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా అప్పటి ప్రభుత్వం రూ.80 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బ్రహ్మణ్ గావ్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినప్పటికీ, ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో ఎత్తిపోతల లిఫ్టింగ్ పరికరాలు దొంగతనానికి గురికావడంతో రైతంగానికి చుక్క నీరు అందలేదని ఆయన చెప్పారు.ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశంలో శాసనసభ దృష్టికి తాను తీసుకు రావడంతో మంత్రి ఉత్త కుమార్ రెడ్డి స్పందించారని తెలిపారు. యుద్ధప్రాతిపాదికన ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో అందులో భాగంగానే రైతులతో కలిసి ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన్నట్లు ఎమ్మెల్యే వెల్లండించారు. ఈ సందర్భంగా ఏమేం సౌకర్యాలు కావాలో రైతులు, అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమస్యను శాసనసభ దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం తక్షణ సహాయంగా 6 కోట్ల రూపాయల నిధులు ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎత్తిపోతల పునరుద్ధరణపూర్తయితే గన్నోరా, రువ్వి, రువ్వి తండా, బ్రహ్మణ్ గావ్, కిర్గుల్ కె, కిర్గుల్ బి. గ్రామాల్లో 6000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు నర్సా గౌడ్, ధర్మపురి సుదర్శన్, సతీష్ రెడ్డి, విఠల్ రావు ,తాటివర్ రమెష్, దేవోజీ భూమేష్, లక్ష్మి నారాయణ, కిష్టారెడ్డి, రాజు, బాలాజీ, శేఖర్ సంబంధిత శాఖ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.