స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం

We will show our power in local body elections– బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కదూరి అచ్చయ్య

నవతెలంగాణ – బొమ్మలరామారం  
మండల కేంద్రంలోని బీజేపీ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కందూరి అచ్చయ్య హాజరై మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో మరింత బలంగా ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిమ్ముల రవీందర్ రెడ్డి, కిషన్ మోర్చా అధ్యక్షులు క్కిర్ రాజేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు భీమరి రాజు, సోషల్ మీడియా కన్వీనర్ పాములపర్తి నరేష్ చారి, నాయకులు చీర గణేష్, చీరాల విక్రాంత్ రెడ్డి, తదితరు నాయకులు పాల్గొన్నారు.