– హుస్నాబాద్‌బిడ్డగా మీ గౌరవాన్ని రెట్టింపు చేస్తా
– ఎంపీగా నేను చేసిన అభివృద్ది, మీరు చేసిన అభివృద్ది పనులను చూద్దాం వినోద్, సంజయ్‌లకు పొన్నం సవాల్
– వెలిచాల రాజేందర్ గెలుపుకు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి విస్తృత ప్రచారం
నవతెలంగాణ – కోహెడ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఆగష్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గెలుపును ఆకాంక్షిస్తూ మండల కేంద్రంలో రోడ్‌షో, కార్నర్ మీటింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంబానీ, అదానీల వద్ద ఉన్న ప్రజాధనాన్ని వెలికితీసి, ప్రజల సొమ్ము ప్రజలకు అప్పగిస్తామని, ఆ బాధ్యత కేంద్రంలో అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కేంద్రంలో బీజెపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీలో ప్రజలను హరిగోస పెట్టుకున్నాయని విమర్శించారు. ప్రజలకు నిత్యవసర ధరలు పెంచి చుక్కలు చూపిస్తున్నారన్నారు. అలాగే పదేళ్లలో దేశాన్ని దోచుకొని అదానీ, అంబానీలకు దారదత్తం చేసిందని విమర్శించారు. పదేళ్ల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతోపాటు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తూ నిరుపేదలకు ఆసరాగా నిలిచిందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎదిగానని, కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్‌రావును గెలిపించాలని ఆయన కోరారు. శ్రీరాముడి పేరుతో ఓట్లు అడిగేందుకు వస్తున్నారని అలాకాకుండా తాము చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ఎన్నికలకు రావాలని బీజెపీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, సీనియర్ నాయకురాలు కర్ణకంటి మంజులరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, నాయకులు శెట్టి సుధాకర్, బండిపల్లి నారాయణ, వేల్పుల వెంకటస్వామి, బందెల బాలకిషన్, చింతకింది శంకర్, గూడ స్వామి, అబ్దుల్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.