వికారాబాద్‌ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

– వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్క రిస్తామని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఫిల్టర్‌ బెడ్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ వికారాబాద్‌ పట్టణానికి మిషన్‌ భగీరథ వాటర్‌ సరైన మోతాదులో రాకపోవడం కారణంగా ఈ మధ్య శివారెడ్డిపేట చెరువు నీళ్లు కూడా ఫిల్టర్‌ చేసి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో నీళ్లు ఎర్రగా వస్తున్నాయని పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదు రావడంతో ఫిల్టర్‌ బెడ్‌ను సందర్శించినట్టు తెలిపారు. ఫిల్టర్‌ బెడ్‌లో పంపుసెట్ల మరమ్మతులు, ఫిల్టర్ల మరమ్మతులతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించి వీలైనంత తొందరగా శుద్ధినీరు అందిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా నీటి సరఫరా పెంచి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఈఈని కోరగా, ఈఈ సానుకూలంగా స్పందించారని చైర్‌పర్సన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌, మేనేజర్‌ కృఫాకర్‌, వాటర్‌ సప్లై సిబ్బంది పాల్గొన్నారు.