
నిజామాబాద్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి డైరీ బహూకరించడం జరగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని వారికి చెప్పడం జరిగింది. వారు ఈ సందర్భంగా ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని,అదేవిధంగా ఉపాద్యాయులు ఎస్ ఎస్ సి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి అందరూ ఉత్తీర్ణత అయ్యేవిధంగా కృషి చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధర్మేందర్,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్,రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ (వాసు), ఎయిడెడ్ టీచర్స్ రాష్ట్ర కో కన్వీనర్ రవీందర్ గౌడ్,జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కాంతారావు,నిజామాబాద్ అర్బన్ అద్యక్షులు సన ఉద్దీన్ పాల్గొన్నారు.