జన్నారం మండలంలోని గిరిజన గ్రామమైన బంగారు తండా గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని ఆ గ్రామస్తులు ఐటీడీఏ పీవోకు దరఖాస్తు చేయగా, స్పందించిన విద్యుత్ అధికారులు శుక్రవారం,ఆ గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.సందర్భంగా విద్యుత్ ఎస్సీ ఈ శ్రావణ్ మాట్లాడుతూ గ్రామంలోని పొలాల్లో ఉన్న విద్యుత్ సమస్యను పంటలు పూర్తయిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. అప్పటివరకు రైతులు సంయమనం పాటించాలన్నారు. డి ఈ ఎండి కైసర్ ,ఏడిఈ టెక్నికల్ తిరుపతి, ఏడిఈ ప్రభాకర్ ఏఈ లచ్చన్న, గ్రామ రైతులు పాల్గొన్నారు.