– డైరీ ఆవిష్కరణలో డాక్టర జి.గంగాధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల వెల్ఫేర్ బోర్డు కార్యదర్శి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ డాక్టర్ జి.గంగాధర్ హామీని చ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని టంగుటూరి అంజయ్యభవన్(కార్మిక శాఖ సంక్షేమ భవన్)లో తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంమోహన్, ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు, రాష్ట్ర నాయకులు కె.జంగయ్య, తుపాకీ ఆంజనేయులు, ఎం.రాజు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.