– పీఆర్టీయూటీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్ని ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితోపాటు సీఎం రేవంత్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకటించారు. పీఆర్టీయూటీఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ బిల్లులు తదితర విద్యారంగ సమస్యల గురించి సీఎం దృష్టికి వారు తీసుకెళ్లారు. త్వరలోనే సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామంటూ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.