రెవిన్యూ డివిజన్‌ వచ్చేదాకా జేఏసీకి అండగా ఉంటాం

– విశ్రాంత ఉద్యోగుల సంఘం
– అధ్యక్షులు కరెడ్ల రఘుపతి రెడ్డి
– పదో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు అండగా ఉంటామని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కరెడ్ల రఘుపతి రెడ్డి తెలిపారు. జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలు బుధవారం పదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కూర్చోగా వారికి జేఏసీ చైర్మన్‌ రామగల్ల పరమేశ్వర్‌, కో చైర్మన్‌ పుర్మ ఆగంరెడ్డి కండువాలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షల నిర్వహణ కోసం విశ్రాంత ఉద్యోగ సంఘం నాయకులు రూ. 5116 లను జేఏసీ నాయకులకు అందజేశారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ప్రకటించేంతవరకు జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమాలకు అండగా నిలబడి ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామని తేల్చి చెప్పారు. ఈ దీక్షలో భూషణమైన రాజ మల్లయ్య, మంద మల్లారెడ్డి, పోలోజు వెంకటాద్రి, టివీ నారాయణ, గుజ్జుల చంద్రమౌళి, బండ సాయిలు, ఎనమల్ల సుదర్శన్‌, రాపెల్లి సుదర్శన్‌, జంగని పద్మ, నాగిళ్ల వెంకటరెడ్డి ,పిల్లి చంద్రయ్య, కవ్వం నారాయణరెడ్డి, పోలోజు ఆచారి, గొట్టం కష్ణారెడ్డి, అల్లం కనకయ్య, కవ్వం వెంకటరెడ్డి, తౌట రామాంజనేయులు, నార్ల లక్ష్మణ్‌, బింగి యాదగిరి, తదితరులు కూర్చున్నారు. ఈ దీక్షకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్‌, అంబటి, అంజయ్య రాళ్ల బండి నాగరాజు, బోయిని మల్లేశం, బిజ్జ రాము, చందా శ్రీకాంత్‌, పోతుగంటి ప్రసాద్‌, గూడ రాజిరెడ్డి, బొమ్మగాని అంజయ్య, బండారి సిద్ధయ్య, నర్ర కేశవులు, మద్దతు ప్రకటించారు.