దళిత కళ్యాణ్ సభ్యులకు ఏమైనా ఆపద వస్తే అండగా నిలుస్తాం 

We will stand by the members of Dalit Kalyan if there is any dangerనవతెలంగాణ – కంఠేశ్వర్ 
దళిత కళ్యాణ్ సభ్యులకు ఏమైనా ఆపద వస్తే అండగా నిలుస్తామని దళిత కళ్యాణ్ సమితి జిల్లా అధ్యక్షులు దౌలచాక్రి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర గైక్వాడ్, తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం దళిత కళ్యాణ్ సమితి పంబౌడి( నాందేవ్ వాడ) శాఖ అధ్యక్షురాలు కల్పనాబాయి సిరిసాటి కుమారుడు అఖిల్ అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని మనోరమ  ఆస్పత్రిలో చేర్పించడం జరిగింది. ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించినానంతరం పెద్ద పేగు కు రంధ్రం పడిందని అత్యవసరంగా సర్జరీ చేయాల్సి ఉందని చెప్పారు. తల్లి కల్పనా బాయి, తల్లడిల్లి పోయింది. ఈ విషయం తెలుసుకున్న దళిత కళ్యాణ్ సమితి జిల్లా శాఖ స్పందించి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు.  ధైర్యం చెప్పడంతో పాటు తమ వంతుగా కొంత ఆర్థిక సాయం అధ్యక్షులు దౌలత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర గైక్వాడ్, ఆధ్వర్యంలో రామారావ్ పట్టణ అధ్యక్షులు నవీన్, మనోహర్ రావు, మారుతి, శివాజీ, మదినే ప్రేమ్ నాథ్, దావుని స్నేహలత, తదితరులు కలిసి ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సాయం అందించిన వారిలో దళిత కళ్యాణ్ సభ్యులకు ఏమైనా ఆపద వస్తే కళ్యాణ్ సమితి అండగా ఉంటామని అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రామ్ చంద్ర గైక్వాడ్ తెలియజేశారు.