
ఏంఆర్పీఎస్ ను సాగర్ నియోజకవర్గంలో బలోపేతం చేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిగొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం పెద్దవూర మండల కేంద్రంలో ఎంఆర్పీ ఎస్ నూతన కమిటీ ఎంపిక చేశారు. మండల అధ్యక్షుడుగా బట్టుగూడెం గ్రామానికి చెందిన ఆదిమల్ల సత్యనారాయణ,
సంగారం గ్రామానికి చెందిన తరి రవికుమార్ ను ప్రధాన కార్యదర్శిగా, ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం ఏంఆర్పిఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకు సాగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి మరో ఉద్యమానికి సిద్ధం చేస్తామని తెలిపారు.