తెలంగాణ యూనివర్సిటీ నూతనంగా నియమకమైన వైస్ ఛాన్సలర్ యాదగిరి రావు తెలంగాణ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పంచ రెడ్డి చరణ్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా యూనివర్సిటీ లోనెలకొన్న సమస్యలను వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నూతనంగా బాలికల వసతిగృహం నిర్మించాలని, యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, స్పోర్ట్స్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని, నూతన కోర్సులను ప్రవేశ పెట్టడంతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా ప్రారంభించాలని, యూనివర్సిటీ లో వివిధ శాఖలలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుందని దానిపై దృష్టి సారించాలని, పరిశోధన విద్యార్థులకు ప్రత్యేక వసతి గృహం నిర్మించాలని, న్యాక్ గుర్తింపు కోసం యూనివర్సిటీ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దానికి తెలంగాణ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం తరపున కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వైస్ ఛాన్సలర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామావత్ లాల్ సింగ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.