
నవతెలంగాణ- దౌల్తాబాద్ : కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు కష్టసుఖాలలో అండగా ఉంటామని దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండలం మహ్మద్ షాపూర్ గ్రామంలో ఇటివల మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీమంత్రి ఎమ్మెల్యే ముత్యం రెడ్డి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి మాజీ ఎంపీటీసీ, సర్పంచిగా పోటీ చేసిన వ్యక్తి బూదయ్య అని కొనియాడారు. ఆయన సతీమణి మరణం వారి కుటుంబానికి తీరని లోటని గుర్తు చేశారు. కేశవగారి నారాయణ మృతి వారి కుటుంబ సభ్యులకు తీరని లోటన్నారు.ఇరువురి కుటుంబాలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు బండారు లాలు, మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, గ్రామ అధ్యక్షులు రాజా గౌడ్, మాజీ సర్పంచ్ దమ్మన్నగారి మల్లేశ్ యాదవ్, అన్నారెడ్డిగారి సంపత్ రెడ్డి, అన్నారెడ్డిగారి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.