మృతుని కుటుంబానికి అండగా ఉంటాం..

– మండల మాజీ వైస్ యంపిపి బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి.
నవతెలంగాణ-తొగుట
మాదారం నర్సయ్య కుటుంబానికి అండగా ఉం టామని మండల మాజీ వైస్ యంపిపి బాసిరెడ్డి  శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కాన్గల్ గ్రామానికి చెందిన మాదరం యేసెబ్ తండ్రి నర్సయ్య 70 గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో  బాధపడుతూ మరణించాడు. వారి కుటుంబానికి మాజీ మండల వైస్ యంపిపి బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 50 కేజీల బియ్యాన్ని బీఅర్ఎస్ నాయకులతో పంపించారు. వారు మాట్లాడుతూ గత కొన్ని సంత్సరాల క్రితం నర్సయ్య గ్రామ పంచాయతీ కార్మికునిగా పనిచేశారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో గ్రామ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు లింగు పల్లి బాలరాజు, సీనియర్ నాయకుడు మాధారం ప్రశాంత్, నర్సింలు, శివ తదితరులు ఉన్నారు.