అన్నివిధాలుగా అభివృద్ధి చేశారు… అండగా ఉంటాం

– గాగీల్లపూర్ గ్రామ ఆశీర్వాద సభలో ఎమ్మెల్యేకు గ్రామస్తుల అభినంధనలు 

– మూడోసారి భారీ మెజార్టీతో ఎన్నుకుంటామని ఎమ్మెల్యే రసమయికి భరోసా
నవతెలంగాణ-బెజ్జంకి 
మాకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా… ముంపు గ్రామామైన మా గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే రసమయన్నదేనని.. అభివృద్ధికి అండగా ఉంటామని..మూడోసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని గాగీల్లపూర్ గ్రామ ప్రజలు అనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రసమయికి గ్రామస్తులు భరోసానిచ్చారు. శనివారం మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హజరవ్వగా గ్రామ మహిళలు బతుకమ్మలతో, బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచాలు కాల్చుతూ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు. మానకొండూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రెండు ధపాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలోని మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటా ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెర్చానన్నారు.గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేశానని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ మరోసారి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన ఎమ్మెల్యే రసమయికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కవిత, ఏఎంసీ చైర్మన్ చంద్రకళ,సర్పంచ్ అన్నాడి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ కొమిరే మల్లేశం, ఉప సర్పంచ్ బామండ్ల తిరుమల, మండల, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు హజరయ్యారు.