‘సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు, వాటి థియేటర్ల విషయమై వెబ్‌సైట్లు, యూ ట్యూబ్ ఛానెల్స్ సరైన సమాచారంతో రాయండి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు రాసి, పరిశ్రమలో అనారోగ్య వాతావరణాన్ని తీసుకురండి. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శులు కె.యల్. దామోదర్ ప్రసాద్, కె. అనుపమ్ రెడ్డి, తుమ్మల ప్రసన్న కుమార్ అన్నారు. ‘పలు వెబ్‌సైట్లు, యూ ట్యూబ్‌లో వచ్చిన వార్తలను ఖండిస్తూ వీళ్ళు స్పందించారు. ‘థియేటర్ల వివాదాల పై తెలుగు చిత్రాలకి సంబంధించి మా మూడు సంస్థలు 15 రోజుల క్రితం సంక్రాంతి బరిలో ఉన్న ఐదుగురు ప్రొడ్యూసర్లను పిలిచి గ్రౌండ్ రియాలిటీ వివరించి, సహకరించమని కోరాం. సంక్రాంతి బరిలో ప్రతి ఏటా సినిమాల పోటీ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఐదు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. హనుమాన్, ఈగల్, సైంధవ్, గుంటూరు కారం, నా సామి రంగ. ఛాంబర్ వినతిని మన్నించి సంక్రాంతి బరి నుంచి ‘ఈగల్’ని సదరు నిర్మాతలు ఫిబ్రవరి 9కి మార్చడం జరిగింది. రవితేజ లాంటి మాస్ హీరో ఇండిస్టీ బాగు కోసం ముందుకు వచ్చి సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం తద్వారా మిగతా నలుగురికి సహకరించడం ఇండిస్టీకి ఆహ్వానించదగ్గ శుభపరిణామం. అదేవిధంగా సంక్రాంతి బరికి సిద్ధమైన హీరో రజనీకాంత్ , ధనుష్ కూడా సహకరించి వాళ్ళ సినిమాలను వాయిదా వేసుకున్నారు. శివ కార్తికేయన్ తమిళ్ సినిమా కూడ రిలీజ్‌కి ఉండగా ఆ ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడి సినిమాని 19కి వాయిదా వేయించడం జరిగింది. తెలుగు సినిమాకి సంబంధించి మా మూడు సంస్థలు కలిపి ఏ హీరోకి, ప్రొడ్యూసర్‌కి, దర్శకుడుకి ఇబ్బంది కలగకుండా నిర్ణయాలు తీసుకుంటూ నడిపిస్తున్నాం. కానీ కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్, ఇతర మీడియా కావాలనే సంక్రాంతి టైంలో వాళ్ల రేటింగ్లు, టిఆర్పీల కోసం ఇష్టమైన రాతలు, ఆర్టికల్స్ రాస్తూ సినీ ఇండిస్టీలో ఫ్యాన్స్ మధ్య, హీరోల మధ్య, ప్రొడ్యూసర్ల మధ్య, దర్శకుల మధ్య ఇబ్బందికర వాతావరణాన్ని సష్టిస్తున్నారు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక పై రాసేటప్పుడు మా మూడు ఆర్గనైజేషన్స్‌ని సంప్రదించి నిజాన్ని తెలుసుకుని వార్తలని ప్రచురించాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలా చేయని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటాంలి.