ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

– రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌ గౌడ్‌
– హుడా కాలనీ ప్రాథమిక పాఠశాలలో బడిబాట
– నోటు పుస్తకాలు పాఠ్యపుస్తకాలు అందించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ- శంషాబాద్‌
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటా మని రాజేంద్రననగర్‌ ఎమ్మెల్యే టి ప్రకాష్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం శంషాబాద్‌లోని హుడ కాలనీ ప్రాథమిక పాఠ శాలలో నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిన్నా రులకు పాఠ్యపుస్తకాలు నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్స్‌ అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు గతం కంటే చాలా అభివద్ధి చెందాయని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా స్వేచ్ఛగా పిల్లలు చదు వుకునే వెసులుబాటు ప్రభుత్వ పాఠశాలలోనే దక్కుతుం దన్నారు తల్లిదండ్రులు ఏమాత్రం సంకోచం లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. శంషాబాద్‌ మండలంలో ప్రభుత్వ పాఠశాల అభివద్ధికి చర్యలు తీసుకుంటు న్నామని అన్నారు. హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా అభివద్ధి చెందడం అభినందనీయమని అన్నారు ఉపాధ్యాయుల కషి ఉంటే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలనైనా ఉన్నతంగా తీర్చి దిద్దే అవకాశం ఉంటుందని అన్నా రు. ఉపాధ్యాయుల సంకల్పం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పడానికి హుడా కాలనీ ప్రాథమిక పాఠశాల ఉదాహరణ గా నిలుస్తుందన్నారు. హుడా కాలనీ ప్రభుత్వ పాఠశాలకు కావలసిన సదుపా యాలు సమకూరు స్తామని తెలిపారు. అనంతరం పాఠశా ల ప్రధానోపాధ్యాయులు ఎన్‌.మలేష సంకల్పించి జడ్పీటీసీ నీరటి తన్వి రాజు సహకారంతో తయారుచేసిన బుక్కు (సావనీర్‌)ను ఎమ్మెల్యే చేతుల మీ దుగా ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో శంషాబాద్‌ మున్సి పల్‌ చైర్‌ పర్సన్‌ కే. సుష్మ మహేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మెన్‌ బండి గోపాల్‌ యాదవ్‌, జడ్పీటీసీ నీరటి తన్విరాజు ముదిరాజ్‌, మండల విద్యాధి కారి డి.రామ్‌ రెడ్డి, గౌరవ అధ్యక్షులు వక్కంటి జనార్ధన్‌, కౌన్సిలర్లు భారతమ్మ, మేకల వెంకటేష్‌, వైస్‌ ఎంపీపీ నీలం మోహన్‌, ఉపాధ్యాయులు బాల్‌రెడ్డి ఇమ్మానియేల్‌, వెంకట రమణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్కూడ ప్రాథమిక పాఠశాలలో
అక్షరాభ్యాస కార్యక్రమాన్ని హెచ్‌ఎం నర్సింలు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిహెచ్‌ఎస్‌ ఇన్‌ చార్జి హెచ్‌ఎం మధుసూదన్‌ రెడ్డి ఉపాధ్యాయులు శ్రీని వాస్‌ తదితరులు పాల్గొన్నారు.
పిల్లోనిగూడ ప్రాథమిక పాఠశాలలో
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని హెడ్‌ మా స్టర్‌ రాధాకష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు రుక్మయ్య, ఆనంద కుమార్‌, పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌ అంగన్‌వాడీ టీచర్స్‌ అనిత, జ్యోతి నాయకులు జుర్కి రమేష్‌ పటేల్‌ పాల్గొన్నారు.